Monday, February 3, 2025

ఆరుగురు గురుకుల విద్యార్థుల మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

ఆరుగురు గురుకుల విద్యార్థులు మిస్సింగ్ అయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో చోటు చేసుకుంది. మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో ఉన్న గురుకుల పాఠశాల నుంచి పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి కనిపించడంలేదు. దీంతో ఉపాధ్యాయులు చుట్టు పక్కల వెతికి సాయంత్రం వరకు వస్తారనుకొని వేచి చూశారు. సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయుడు మందలించడం వల్లే విద్యార్థులు బయటకు వెళ్లినట్లు తొటి విద్యార్థులు చెప్పారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ ప్రారంభించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News