సినీ గాయకుడు ఉదిత్ నారాయణ్(69) లైవ్ కాన్సర్ట్‌లో తన అభిమానిని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా దీనిపై ఆయన ‘నేనేమి తప్పుచేయలేదు’అన్నారు. విషయంలోకి వెళితే 1990 దశకం నాటి హిందీ సినిమా‘మొహ్రా’ పాట ‘టిప్ టిప్ బర్సా పానీ’కి ఆయన పర్ఫామెన్స్ చేస్తున్నప్పుడు ఓ ఫిమేల్ అభిమాని సెల్ఫీ తీసుకోడానికి స్టేజి మీదకు వెళ్లింది. ఫోటో స్నాప్ తీసుకున్నాక గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఈ వివాదంపై ఆయన అభిప్రాయం తెలుసుకోడానికి పిటిఐ ప్రయత్నించినప్పుడు ఆయన వ్యాఖ్యానించడానికి, స్పష్టీకరణ ఇవ్వడానికి నిరాకరించారు.
అయితే ఆయన తన అభిమానిని ముద్దు పెట్టుకున్న వీడియో చాలా వైరల్ అయింది. ‘మై కిలాడీ తూ అనాడీ’, ‘మై యహా హూ’, ‘అయ్ అజ్‌నబీ’ వంటి బ్లాక్‌బస్టర్ పాటలు పాడి ప్రసిద్ధుడైన ఉదిత్ నారాయణ్‌ను క్షమాపణలు చెప్పమని అనేక మంది సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. కాగా ఆయన మాత్రం ‘నేనెలాంటి తప్పు చేయలేదు’ అన్నారు. కాగా ఆయన నిర్వహించిన ఆ కాన్సర్ట్ ఎక్కడ, ఎప్పుడు నిర్వహించారన్నది స్పష్టం కాలేదు. కానీ దానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.