మహాకుంభమేళాలో అత్యంత పవిత్ర దినాలలో ఒకటైన వసంత పంచమి నాడు ఎలాంటి పొరపాట్లు లేకుండాలక్షలాది మంది పుణ్యస్నానాలు చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమం త్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా ఆదేశించడంతో కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేశారు. సోమవారం అమృత్ స్నాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ అధికారులు రం గంలో దిగారు. 2019లో అర్థ్ కుంభ మేళా ను సజావుగా ,విజయవంతంగా నిర్వహించిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా యూపీ సర్కార్ ఇక్కడకు పం పింది. అశిష్ గోయల్, భాను చంద్ర గోస్వామి ప్రస్తుతం మహా కుంభమేళాను పర్యవేక్షిస్తున్న అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తో కలిసి కీలక బాధ్యతలు పంచుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం అర్థ్ కుంభ మేళా నిర్వహణలో వీరి పాత్ర ఉంది. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ భాను భాస్కర్ స్వయంగా మేళాలో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ, సెక్యూరిటీ సిబ్బందికి ప్రతి క్షణం అదనపు సూచనలు ఇస్తున్నారు.
స్వయంగా ఏర్పాట్లు పరిశీలించిన సిఎం యోగి ఆదిత్యనాథ్
మౌని అమావాస్య నాటి దుర్ఘఠన తర్వాత శనివారంనాడు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మేళాకు వచ్చి అక్కడి పరిస్థితులు, సెక్యూరిటీ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. .సీఎం యోగీ మొదట తొక్కిసలాట జరిగిన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రులకు వెళ్లి గాయపడి కోలుకుంటున్న యాత్రికులను పరామర్శించారు. వారి పరిస్థితి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వసంత పంచమి సందర్భంగా పుణ్య స్నానాలు చేసే భక్తులకోసం చేసిన ఏర్పాట్లను ఓ సమావేశంలో స మీక్షించారు. ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా..అత్యంత జాగ్రత్తవహించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఆదివారంనాడు ఏడీజీ భాస్కర్ మహా కుంభమేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. మేళా జరిగా ప్రాం తాన్ని అంతా స్వయంగా పర్యవేక్షించారు. భక్తులు మేళా ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రదేశం, తిరిగి వెళ్లే మార్గాలను భారీస్క్రీన్ లో పర్యవేక్షించి లౌడ్ స్పీకర్ లో ఎక్కడెక్కడ జనం ఉన్నారో గుర్తిస్తూ.. వారందరినీ వెంటనే పంపివేయాలని ఆదేశించారు.
ఘాట్‌ల వద్ద పోలీసుల హెచ్చరికలు..
స్నానాలు ముగిసిన వెంటనే.. ఘాట్ విడిచి వెళ్లిపోవాలని, ఎక్కడా కూర్చోడం, వంటివి చేయవద్దని, యాత్రికులకు ఏడీజీ విజ్ఞప్తి చేశారు. ఘాట్‌ల వద్ద తినడం కానీ, తాగడం కానీ చేయవద్దని, వారి కోసందూరంగా నిర్దేశించిన ప్రదేశం లో భోజనం ఏర్పాట్లు చేసిన స్థలాలకు వెళ్లి తినాలని యాత్రికులను కోరారు. స్నానాల ఘాట్ లవద్ద చిరుతిండ్లు తినడం చేయరాదన్నారు ఏడీజీ.మేళా నిర్వాహక అధికారులు భాను చంద్ర గోస్వామి, ఆశిష్ గోయల్ కూడా లక్నో నుంచి వచ్చిన వెంటనే మేళా ప్రాంతాన్ని పర్యవేక్షించారు. 2019 లో అర్థ్ కుంభ మేళా సందర్భంగా గోస్వామి ప్రయాగ్ రాజ్ అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్ గా పనిచేశారు. గోయల్ ప్రయాగ్ రాజ్ డివిజనల్ కమిషనర్ గా పనిచేశారు.
వసంత పంచమి ని పురస్కరించుకుని ఇప్పటికే పవిత్ర స్నానాలు మొదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికే గంగా నది లోనూ, సంగం వద్ద 90 లక్షలకు మందికి పైగా భక్తులు అమృత్ స్నానాలు పూర్తి చేశారు. జనవరి 13 ముంచి ఇప్పటి వరకూ 33 కోట్ల 61 లక్షల మంది మహా కుంభ పవిత్ర స్నానాలు పూర్తి చేశారు. కుంభ మేళాకు వచ్చిన యాత్రికులు ప్రయాగ్ రాజ్ లో కేవలం సంగం వద్దే స్నానాలు చేయాలనే నియమం పెట్టుకోకుండా ప్రయాగ్ రాజ్ లో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా స్నానాలు చేయవచ్చని.. కుంభ మేళాలో స్నానం చేసినట్లే నని అఖిల భారత అఖాడా పరిషత్ ప్రెసిడెంట్ మహంత్ రవీంద్ర పురి విజ్ఞప్తి చేశారు.