- Advertisement -
సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా..పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చేస్తే తొలి నెల నుంచే రూ.70 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు. డిగ్రీ విద్యారహతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష,ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. దేశ వ్యాప్తంగా వెయ్యి ఖాళీలతో కోర్సులో ప్రవేశానికి సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారు జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్-1 క్రెడిట్ ఆఫీసర్ హోదాతో సెంట్రల్ బ్యాంకులో చేరిపోవచ్చు. ఈ కోర్సు కాలపరిమితి ఏడాది. ఇందులో 9 నెలలు తరగతి గది శిక్షణ,3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. చదువు, వసతి , భోజనం అన్ని కలిపి మొత్తం రూ. 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. ఈ కోర్సులో ప్రతి నెలా రూ.2500 చొప్పున 9 నెలలు స్టైపెండ్ వేతనం చెల్లిస్తారు.
- Advertisement -