నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహరాజ్ బాలయ్య కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచిం ది. ఇక ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య నుంచి క్రేజీ లైనప్ ఉండగా ఇందు లో తన కంబ్యాక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం కూడా ఒకటి. ఇక బాలయ్య తాజాగా అఖండ్2 సెట్స్ లో వచ్చి చేరాడు. ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో స్పెష ల్‌గా వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగు తోంది. బాలయ్య అఘోరా గెట్ప్‌పై సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య లుక్ అదిరే లెవెల్లో ఉంటుంది అని టాక్ వచ్చింది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇపుడు మరో టాక్ వినిపిస్తుంది. దీనితో అఖండ 2 ఫస్ట్ లుక్ మహాశివరాత్రి కానుకగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య పై బోయపాటి మంచి పవర్ ఫుల్ లుక్ ని సిద్ధం చేయగా అది శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రజ్గ జైస్వాల్, సంయు క్తా మీనన్ నటిస్తున్న అఖండ్2 తాండవంకు తమన్ సంగీతం అందించ్నున్నాడు. ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు తెరకెక్కిస్తున్నారు.సెప్టెంబ్ 25న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది.