Monday, February 3, 2025

అమెజింగ్ ఇండియన్ మాచన రఘునందన్

- Advertisement -
- Advertisement -

అతను వైద్యుడు ఐతే ఈ పాటికి పద్మం వరించేది. శాస్త్ర వేత్త అయినా ఏదో ఒక అవార్డు వచ్చేసేదే..కానీ ఓ వ్యక్తి సాధారణ ఉద్యోగి .ఉద్యోగం చేసుకుంటూ.. ఓ నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం అన్న యావ ఏ కోశానా కనపడదు ఐనా.. అతని లో ఉన్న సమాజాన్ని మార్చాలి అనే తపన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిoది. పలు అవార్డులు అందుకునేలా చేసింది.పౌర సరఫరాల శాఖ లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిసీల్దార్ గా పని చేస్తున్న మాచన రఘునందన్ ఇరవై ఏళ్ల నుంచి పొగాకు నియంత్రణ కు తద్వారా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే లా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.పంజాబ్ చండీఘర్ కు చెందిన రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ వారు టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్ అని అవార్డు ప్రదానం చేశారు.

అంతటి తో ఆగలేదు ఆ కసి,కృషి జర్మనీ కి చెందిన పల్మనరీ మెడిసిన్ అనే వైద్య విజ్ఞాన మాస పత్రిక వెల్ డన్ రఘునందన్ అని అభినందించి ప్రత్యేక కథనం ప్రచురించింది.ఇలా 20 ఏళ్లు సమాజ హితం కోసం పాటు పడే వ్యక్తులు అరుదు అని పేర్కొంది.తాజాగా ముంబయి కి చెందిన టాటా మెమోరియల్ సెంటర్ వారు అమేజింగ్ ఇండియన్ అంటూ కొనియాడారు.విధి నిర్వహణలో అంకిత భావం తో ఉండి,అందరూ బాగుండాలి అని కోరుకునే మాచన రఘునందన్ యువత కు స్ఫూర్తి అని శ్లాఘిoచింది. యువత పొగాకు, ధూమపానం అలవాటు కు గురై జీవితాల్ని ఛిద్రం చేసుకుoటున్నారని అలాంటి వారికి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలను వివరించి “తంబాకు చోడో” అని ప్రార్థన చేస్తున్న వైనం ను అసాధారణ కృషి గా అభివర్ణించింది. అస్తి, పాస్తులు కూడబెట్టడం లో ఆసక్తి చూపే వారే అధికంగా ఉన్న సమాజం లో పొగాకు,పొగాకు ఉత్పత్తుల వల్ల “ఊపిరి ఆగిపోతోంది” అని ఆవేదన వ్యక్తం చేసే మానవతా వాది గా మాచన రఘునందన్ ను అమేజింగ్ ఇండియన్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్విట్టర్ వేదిక గా అభినందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News