- Advertisement -
తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన ఘటన పెద్దపల్లి జిల్లాలోని పెద్ద పెద్దపల్లి మండలం హనుమంతుని పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వడ్లకొండ లక్ష్మయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో లక్ష్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అధి గమించిన స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -