Tuesday, February 4, 2025

బిజెపి ‘అక్రమాల’నమోదుకు స్పై కెమెరాలు పంచాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ బుధవారం జరగనుండగా, బిజెపి, ఆ పార్టీ ‘గూండాల’ ‘తప్పుడు పనులు, ఎన్నికల అక్రమాల’ను నమోదు చేయడానికి మురికివాడల్లో ప్రజలకు స్పై కెమెరాలు, బాడీ కెమెరాలను తమ పార్టీ పంచిందని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం వెల్లడించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కేజ్రీవాల్ ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ, ఆప్ చరిత్రాత్మక విజయం సాధించబోతున్నదని, బిజెపి తన ఆవిర్భావం తరువాత అత్యంత దారుణ పరాజయం ఎదుర్కొనబోతున్నదని, అందుకే అది ‘అక్రమ ఎత్తుగడలకు’ పూనుకుంటున్నదని పేర్కొన్నారు.

బిజెపి గూండాల దుష్కృత్యాలను ఫోటోలు తీయడానికి గాను మేము మురికివాడల వాసులకు స్పై కెమెరాలు, బాడీ కెమెరాలు పంచాం. మేము పలు శీఘ్ర స్పందన బృందాలు (క్యుఆర్‌టిలు) కూడా ఏర్పాటు చేశాం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకోవడానికి, ఆ దుండగులు అరెస్టయ్యేలా చూడడానికి వారు పావు గంటలోగా అటువంటి ప్రదేశాలకు చేరుకుంటారు’ అని ఆప్ చీఫ్ తెలిపారు. ‘ఎన్నికల్లో విజయం కోసం బిజెపి తమ గూండాలను, ఢిల్లీ పోలీసులను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది.

వారు వోటర్లను, ముఖ్యంగా మురికివాడల్లోని వారిని బెదరించే యత్నం చేస్తారు’ అని ఆయన ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు మురికివాడల వాసులకు రూ. 3000 నుంచి రూ. 5000 వరకు ఇవ్వజూపి, ఎన్నికల రోజు వారిని వోటు చేయనివ్వకుండా నివారించేందుకు నల్ల ఇంకుతో వారి వేళ్లపై ముద్ర వేయజూస్తారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ‘వారి డబ్బు తీసుకోండి, కానీ మీ వేలిపై ఇంకు ముద్ర వేయనివ్వకండి’ అని ఆయన వోటర్లకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో బుధవారం (5న) పోలింగ్ జరగనున్నది. ఫలితాలను 8న ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News