Tuesday, February 4, 2025

బిసిల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు : ఆర్ కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కెసిఆర్ చేసిన సర్వేలో 52 శాతం బిసిలు ఉన్నారని, మురళీధర్, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమూ అంతే శాతం ఉన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమే బిసిలు ఉన్నట్లు చూపిస్తోందన్నారు. బిసిల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని తెలిపారు. ఈడబ్లుఎస్ రిజర్వేషన్లు కాపాడేందుకు బిసిలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News