ముంబై: ఐదు టీ20ల సిరీస్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఇంగ్లండ్ తేలిపోయింది. చివరి టి20లో భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడి ఘోరపరాభావాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం 10 ఓవర్లలోనే 97 పరుగులకే చాపచుట్టేసింది. అయితే భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 135 ( 54 బంతుల్లో 7×4, 13×6) మెరుపు సెంచరీతో చెలరేగగాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ మాట్లడుతూ.. అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ఇప్పటివరకు నా కెరీర్‌లో ఎంతో క్రికెట్ చూశాను. కానీ టీ20ల్లో అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూడడం ఇదే తొలిసారి’ అని బట్లర్ అన్నాడు.
ఇలాంటి ఇన్నింగ్స్ నేనెప్పుడూ చూడలేదు: బట్లర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -