- Advertisement -
హైదరాబాద్: బస్సు డ్రైవర్ ట్రిక్ చెప్పడంతోనే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీశానని రైల్వేస్ బౌలర్ హిమాన్షు సంఘ్వాన్ తెలిపాడు. రంజీ మ్యాచ్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని హిమాన్షు తన బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేసిన విషయం తెలిసిందే. తమ జట్టు బస్సు డ్రైవర్ విరాట్ వికెట్ ఎలా తీయాలో పలు సూచనలు చేశాడని, ఐదోవ స్టంప్‌లైన్‌లో బౌలింగ్ చేయాలని సూచించాడని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ చెప్పిన విధంగా బంతిని సంధించడంతో విరాట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడని వివరించారు. బస్సు డ్రైవర్ సూచనలకు తాను షాక్ అయ్యానని, కోహ్లీ బలహీనతలపై కాకుండా తన బలాలపై కూడా దృష్టి పెట్టి బౌలింగ్ చేశానని హిమాన్షు స్పష్టం చేశారు.
- Advertisement -