Tuesday, February 4, 2025

తండేల్ చాలా స్పెషల్ మూవీ: నాగచైతన్య

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ “తండేల్’ ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఏది చూసినా సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది.

సాయి పల్లవి, చైతన్య కెమిస్ట్రీ చాలా రియల్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. హీరో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ “తండేల్ నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ. తండేల్ రాజుకి నాకు రియల్ లైఫ్‌లో చాలా తేడా ఉంటుంది. చందుతో ఇది నా మూడో సినిమా. సాయి పల్లవి అద్భుతమైన నటి. తనని అందరూ ఇష్టపడతారు. ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో దుల్లకొట్టేద్దాం”అని అన్నారు.

నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ “ఇది నా కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. ఈ సినిమాకు దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికీ మూడు సాంగ్స్ బ్లాక్‌బస్టర్ అయ్యాయి. మరో సాంగ్ రాబోతోంది. డైరెక్టర్ చందు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి, దిల్ రాజు, దేవిశ్రీ ప్రసాద్, ఎస్కేఎన్, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, నాగేంద్ర, శ్యామ్ దత్, శ్రీమణి, జొన్నవిత్తుల, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛమైన ప్రేమ కథ..

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బన్నీవాసు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని డైరెక్టర్ చందు డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్స్ ద్వారా జరిగిన కథ చెప్పాం. -ఇది స్వచ్ఛమైన ప్రేమ కథ. ఇది యాభై శాతం ఫిక్షన్. యాభై శాతం నాన్ ఫిక్షన్. డైరెక్టర్ విజన్‌ని వందశాతం ఫాలో అయ్యాం.

– మత్సలేశ్యం అనే ఊరుని ఆధారంగా చేసుకుని తీసుకున్న కథ ఇది. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్‌కి ఫిషింగ్‌కి వెళ్తారు. అక్కడ బోట్లు వున్న వారికి బిరుదులు వుంటాయి. మెయిన్ లీడర్‌ని తండేల్ అంటారు. ఇది గుజరాతీ వర్డ్. – నాగచైతన్య ఈ పాత్ర కోసం మారిన విధానం అద్భుతం. ఆడియన్స్ అందరినీ ఫిబ్రవరి 7న చైతూ ఆశ్చర్యపరుస్తారు. చివరి అరగంట కుమ్మేశారు”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News