- Advertisement -
అమరావతి: ప్రియురాలితో సహజీవనం చేస్తుండగా భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ సంఘటన ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రెండు సంవత్సరాల క్రితం ఆకుల వాసు అనే యువకుడు నవ్యశ్రీని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా వీణా గాయత్రి అనే బంధువుల అమ్మాయిని వాసు రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం నుంచి నవ్యశ్రీకి కనిపించకుండా వాసు తప్పించుకుని తిరుగుతున్నాడు. సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో వాసు, గాయత్రి ఉన్నారని తెలుసుకుని బంధువులతో నవ్యశ్రీ అక్కడికి వెళ్లారు. రెడ్ హ్యాండెడ్ లో వాసు, వీణాను పట్టుకొని నిలదీశారు. నవ్యశ్రీ, ఆమె బంధువులపై ఆకుల వాసు దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -