Tuesday, February 4, 2025

నా ప్రతి విజయంలో మా నాన్న ఉన్నారు: త్రిష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అండర్ 19 వరల్డ్ కప్ సత్తా చాటిన తెలంగాణ క్రికెటర్‌ గొంగడి త్రిషకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు అండర్‌ 19 ఉమెన్‌ ప్లేయర్స్‌ త్రిష, ద్రితి కేసరి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్లేయర్స్‌కు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్వాగతం పలికింది. అనంతరం త్రిష మీడియాతో మాట్లాడుతూ.. “మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇకనుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్‌లో చోటు సాధించడమే లక్ష్యం. మ్యాచ్ లో ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతి మ్యాచ్‌లో మా పాత్ర ఏంటి అని మాత్రమే ఆలోచించాం. ఈసారి ధృతికి అవకాశం రాలేదు కానీ. తను చాలా మంచి ప్లేయర్. నా ప్రతి విజయంలో మా నాన్న ఉన్నారు” అని తెలిపింది.

కాగా.. భారత్ రెండోసారి అండర్ 19 వరల్డ్ కప్ నెగ్గడంలో గొంగడి త్రిష కీలక పాత్రపోషించింది. సంచలన బ్యాటింగ్‌తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్లోనూ గొంగడి త్రిష(33 బంతుల్లో 8×4తో 44 నాటౌట్) అదరగొట్టింది. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసింది. టైటిల్ సాధించిండలంలో కీ రోల్ పోషించిన త్రిష ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News