- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మంగళవారం శాసనసభ కార్యదర్శి పార్టీ మారిన పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీ నోటీసులో పేర్కొన్నారు. అయితే, వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్లు సమాచారం.
కాగా, 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలు ..కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
- Advertisement -