- Advertisement -
సామాన్యులకు పసిడి ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. రోజురోజుకు అందని ద్రాక్షగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా రికార్డు ధరలు పలుకుతున్నాయి.లక్ష రూపాయల వైపు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో సామన్య ప్రజలు బంగారం కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.86,000కు పెరిగింది. దీంతో కొనుగోలు దారులు బెంబేలెత్తుతున్నారు. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. ఎపిలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
- Advertisement -