Thursday, April 17, 2025

ఎపి పేరు ప్రస్తావించ నంత మాత్రాన నిధులు రానట్లా?: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించనంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో ఎపి పేరు ప్రస్తావించలేదనే విమర్శలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని తెలియజేశారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఎపికే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది వరకే తాము ఆయా రంగాల్లో పాలసీలు తీసుకొచ్చామని, విభజన కన్నా గత వైసిపి ప్రభుత్వ పాలనలోనే ఎపికి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపణలు చేశారు. ఈ రెండు అంశాల్ని ఆర్థిక సంఘానికి వివరించి ఎక్కువ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News