చెన్నై: ఇంటి నుంచి పారిపోతున్న బాలికపై ట్రాఫిక్ కానిస్టేబుల్, బాయ్ ఫ్రెండ్ అత్యాచారం చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్, బాయ్ ఫ్రెండ్‌తో అతడి తల్లిపై పోలీసులు పోస్కో యాక్టు కింద కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం మైళపోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలిక కనిపించడంతో పోవడంతో ఆమె తల్లిదండ్రులు మైళపోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా కుడళూరులో ఉన్నట్టు గుర్తించారు. బాలిక తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి అతడి ఇంటికి వెళ్లింది. బాయ్ ఫ్రెండ్ తల్లి ఆమెను ఇంట్లో రానివ్వకపోవడంతో బయటకు వెళ్లిపోయింది.
బాలిక అదే ప్రాంతంలో ఉండిపోయింది. బాలికను ట్రాఫిక్ కానిస్టేబుల్ రమన్ గమనించి ఆమె ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. బాలికను పోలీస్ బూతులోకి తీసుకెళ్లి ఆమెపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి కానిస్టేబుల్ పారిపోయాడు. వెంటనే అక్కడి తప్పించుకొని బయటకు వచ్చింది. ఇంటికి వెళ్తే తనకు తల్లి పెళ్లి చేస్తుందనే భయంతో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కుడళూరుకు పారిపోయింది. బాలికపై బాయ్ ఫ్రెండ్ పలుమార్లు అత్యాచారం చేసి వదిలేశాడు. కుడళూరు పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానిస్టేబుల్, బాయ్ ఫ్రెండ్, అతడి తల్లిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.