Tuesday, February 4, 2025

సభను వాయిదా వేయడం హాస్యాస్పదం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:సబ్జెక్టు, నోట్స్ సిద్ధం చేయలేదని శాసన సభను వాయిదా వేయడం హాస్యాస్పదమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో స్పందిస్తూ.. అసెంబ్లీని వాయిదా వేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏంటి? అని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోందని.. సబ్జెక్టు, నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయడం హాస్యాస్పదని.. నాడు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా లేరని.. నేడు పాలక పక్షంలో ఉన్నా సిద్ధంగా లేరని హరీశ్‌రావు సెటైర్ వేశారు.

కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం… సభ వ్యవహారాల శాఖ మంత్రి కోరిక మేరకు స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News