Tuesday, February 4, 2025

న్యూడ్‌ వీడియోలు ఉన్నాయంటూ.. భార్య స్నేహితురాలికి బెదిరింపులు..

- Advertisement -
- Advertisement -

న్యూడ్‌ వీడియోలు ఉన్నాయంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని బ్లాక్ మెయిల్ చేసి.. ఆమె నుంచి రూ.2.53 కోట్ల వరకు వసూలు చేసిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో కూకట్‌పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతికి అదే హాస్టల్‌లో చిన్ననాటి స్నేహితురాలు పరిచయం అయింది. ఆమె భర్త నినావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ ను కూడా పరిచయం చేసింది. ఉద్యోగం లేక జల్సాలకు అలవాటు పడ్డ దేవనాయక్.. భార్య స్నేహితురాలైన బాధితురాలిని(సాఫ్ట్ వేర్ ఉద్యోగిని) టార్గెట్ చేశాడు.

ఫోనులో వేరే సిమ్ కార్డు వేసుకొని బాధితురాలికి ఫోన్ చేసి.. నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయని.. వాటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు. అయితే, స్నేహితురాలి భర్తే బెదిరిస్తున్నాడని తెలియక.. బాధితురాలు ఈ విషయాన్ని దేవనాయక్ కే చెప్పింది. దీంతో తెలివిగా తాను సెటిల్ చేస్తానని.. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని, అనేక సాకులు చెప్పి.. బాధితురాలి నుంచి రూ.2,53,76,000 తీసుకున్నాడు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు దేవానాయక్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1,81,45,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News