- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా విడుదలైంది. అయితే.. ఈ మూవీపై ట్రోల్స్ చేయడం, నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ప్రభావం పడింది. చివరికి ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే, సినిమాలో రామ్ చరణ్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. భారీగా ఖర్చు చేసినా.. శంకర్ రేంజ్ లో సాంగ్స్ లేకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.ఈ సినిమాకు థమన్ సంగీతం మైనస్ అయ్యిందని కొంతమంది ఫ్యాన్స్ మండిపడ్డారు. కాగా విడుదలైన 28 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఎక్స్ లో ప్రకటించింది.
- Advertisement -