మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల పార్టీ ఫి రాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చే సుకుంది. తాజాగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చే రిన 10 మంది ఎంఎల్ఎలకు అసెంబ్లీ కార్యదర్శి నర సింహాచార్యులు మంగళవారం నోటీసులు జారీ చే శారు. సుప్రీం కో ర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూ ర్వక సమాధానం చె ప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎం ఎల్ఎలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విష యం తెలిసిందే.
పా ర్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై నాలుగు నెలల్లో చ ర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎ లాంటి పురోగతి లేక పోవడంతో బిఆర్ఎస్ పార్టీ సు ప్రీం కోర్టును ఆశ్రయిం చింది. 2023 అసెంబ్లీ ఎన్నిక ల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎం ఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వే టు వేయాలంటూ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ హైకోర్టు లో పిటిషన్ వేసింది. ఎం ఎల్ఎలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని హై కోర్టు ఆదేశించినప్పటికీ ఈ వ్యవహారం ముందుకు జరగలేదు. దీంతో బిఆర్ ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మొదట తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేం దర్‌పై అనర్హత వేటు వేయాలని
బిఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఆ తరువాత మరో ఏడుగురు ఎంఎల్ఎలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్లపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో జత చేసి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఓ వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే.. పార్టీ మారిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ స్పీకర్‌ను కూడా కోరింది. దీనిపై స్పందించిన స్పీకర్..
పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలకు నోటీసులు ఇచ్చారు.పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపబోతున్న నేపథ్యంలో ఆ లోపు ఎంఎల్ఎలు అసెంబ్లీ కార్యదర్శి నోటీసుపై వివరణ ఇస్తారా… లేదా..? అనేది తెలియాల్సి ఉంది. గడువు కోరితే ఆ గడువు ఎప్పటి వరకు ఉండనున్నది..? ఒక వేళ వివరణ ఇస్తే ఆ వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. నోటీసులపై స్పందించిన ఎంఎల్ఎ కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు సమయం అడుగుతామని చెప్పారు.