- Advertisement -
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
ఈ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్యే అసలైన పోటీ నెలకొంది. నువ్వా.. నేనా అన్నట్లు రెండు పార్టీల మధ్యనే పోరు జరుగుతోంది. గత రెండు సార్లు అధికారం చేపట్టిన ఆప్.. మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. మరోవైపు, ఈసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బిజెపి గట్టిగాన ప్రయత్నిస్తోంది.
- Advertisement -