దుబాయ్: ఈనెల19 నుంచి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం కానుంది. వన్డే పార్మాట్ జరుగనున్న ఈ టోర్నీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారి అభిమాన ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అందులో భారత్‌పాకిస్థాన్ మ్యాచ్ చూసేందు దాయాది దేశాల అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదుచూస్తున్నారు.
అయితే భారత్, పాక్ మ్యాచ్‌లకు సంబంధించి టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన నిమిషాల్లోనే టికెట్లు హాంఫట్ అయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోని భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి.
కాగా.. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఐసిసి సోమవారం సాయంత్రం 5.30కు ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ క్రమంలో నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడయ్యాయి. గరిష్ట టికెట్లు రూ.47 వేలు, రూ. 1.20 లక్షల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. ఇతర మ్యాచ్‌ల టికెట్లన్నీ రూ. 2500 నుంచి ప్రారంభమైతే.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం రూ.10 వేల నుంచి రూ.1.20 లక్షలుగా ఉండడం విశేషం. ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. 19 రోజుల పాటు 15 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ ఎలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.