యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శక త్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్ బ్యాన ర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్‌గా టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
పాటలను చాలా ఎంజాయ్ చేస్తున్నారు…
‘తండేల్’ పాటలకు మంచి స్పందన వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను చేసిన లవ్ స్టొరీ ‘తండేల్’. బుజ్జితల్లి రిలీజైన వెంటనే అద్భుతమైన స్పందన వచ్చింది. సుకుమార్ పాట విని నీ ఆల్‌టైం టాప్ ఫైవ్‌లో ఉంటుందని చెప్పారు. అలాగే శివుని పాట, హైలెస్సో పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్ళాయి. ప్రేక్షకులు పాటలను చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
‘తండేల్’ కూడా అంతే…
నాకు పూర్తిగా రస్టిక్ ఫోక్ స్టొరీ వున్న సినిమా చేయలనే వుండేది. ఆ కోరిక రంగస్థలంతో తీరింది. అందులో పాటలన్నీ జానపద మూలల్లో నుంచి చేసినట్లుగా వుంటుంది. మళ్ళీ అలాంటి ఫోక్ టచ్ వున్న సినిమా ఉప్పెన. అయితే అందులో కంపోజిషన్ కాస్త సూఫీ స్టయిల్, క్లాస్ మిక్స్ చేసినట్లుగా వుంటుంది. కథలు పరంగా రెండింటికి పొంతనలేదు. ‘తండేల్’ కూడా అంతే. ఇది ప్యూర్ లవ్ స్టొరీ.
రాబోయే పాటలు కూడా అద్భుతంగా..
పాకిస్తాన్ సరిహద్దులలో చిక్కుకున్న మ న మత్య్సకారుల కథ తండేల్. యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. ఇప్పటికే మూడు పాటలు విన్నా రు. రాబోయే పాటలు కూడా అద్భుతంగా వుంటాయి. నేపధ్య సంగీతం కూడా చాలా ఫ్రెష్ గా వుంటుంది.
కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు..
డైరెక్టర్ చందూ గ్రేట్ విజన్ తో సినిమా తీశాడు. చాలా అద్భుతంగా చూపించాడు. చైతు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్, పర్ఫార్మెన్స్ చాలా సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. ఎమోషన్స్ చాలా అద్భుతంగా పండించారు. కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు.
కళ్ళతో కూడా నటించారు…
సాయి పల్లవి అద్భుతమైన నటి. ఇందు లో కూడా ఆమె నటన అత్యద్భుతంగా వుంటుంది. కళ్ళతో కూడా నటించారు. నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఓ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వుంటుంది. అది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఫైట్ సీక్వెన్స్‌లు చాలా బాగా తీశారు…
ఇందులో చాలా మంచి యాక్షన్ , బొట్ సీక్వెన్స్ లు వున్నాయి. ఫైట్ సీక్వెన్స్ లు చాలా బాగా తీశారు. నిర్మాత బన్నీ వాసు, అల్లు అరవింద్ చాలా గ్రాండ్‌గా సినిమా తీశారు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని టీం అంతా చాలా నమ్మకంగా వున్నాం.
చాలా ఆనందాన్నిచ్చింది…
కథ చెప్పినప్పుడే కొన్ని ట్యూన్స్ వచ్చేస్తాయి. బుజ్జితల్లి ట్యూన్ కూడా అలా వచ్చింది. హమ్ చేస్తూ పియోనో ప్లే చేశాను. ఆ వీడియో చందూ షూట్ చేసి పోస్ట్ చేశాడు. అప్పుడు వచ్చిన ట్యూన్ అది. పాట మధ్యలో అమ్మాయి పేరు వస్తే చాలా అందంగా వుంటుంది. ఈ పాట మధ్యలో కూడా బుజ్జి తల్లి అనే పదానికి మంచి ప్లేస్‌మెంట్ దొరికింది. పాట రిలీజైన వెంటనే వైరల్ అయి ట్రెండ్ అవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇక నా నెక్స్ సినిమా ’కుబేర’ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇది విభిన్నమైన చిత్రం.