Friday, April 18, 2025

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్..

- Advertisement -
- Advertisement -

తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృద యపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమా నుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజా వుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో, అభిమా నులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరో సారి స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News