Wednesday, February 5, 2025

షమీ ముంగిట అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

మరో ఐదు వికెట్లు పడగొడితే తొలి బౌలర్‌గా ఘనత
మనతెలంగాణ/ క్రీడా విభాగం: భారత్‌-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం నుంచి ప్రారంభంకానుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. 5 టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 కైవసం చేసుకొని జోరుమీదున్న టీమిండియా ఈ సిరీస్ సైతం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో అక్కడకు చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే ఈ వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు స్టార్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టనున్న షమీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. తొలి వన్డేలో మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన షమీ, చివరి టి20లో మూడు వికెట్లు పడగొట్టి ఫాంలోకి వచ్చాడు. ఇప్పుడు వన్డే సిరీస్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 200 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

అయితే, నాగ్‌పూర్‌లో జరిగే వన్డే మ్యాచ్‌లో మహ్మద్ షమీ 5 వికెట్లు తీస్తే ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. మహ్మద్ షమీ తన సత్తా చాటితే.. 101 ఇన్నింగ్స్‌లలో 200 వికెట్లు తీసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. రాబోయే రెండు మ్యాచ్‌లలో అయినా ఐదు వికెట్లు తీస్తే, మ్యాచ్‌ల పరంగా మిచెల్ స్టార్క్ కంటే వెనుకబడి ఉంటాడు.. కానీ ఇన్నింగ్స్ పరంగా మిచెల్ స్టార్క్‌ను సమం చేస్తాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో మహ్మద్ షమీ తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆడిన 101 వన్డే మ్యాచ్‌ల్లో మహ్మద్ షమీ 195 వికెట్లు పడగొట్టాడు. ఐదు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు నాగ్‌పూర్‌లో ఆరోసారి ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. తన పేరు మీద నయా ప్రపంచ రికార్డును నమోదు చేయనున్నాడు. కాగా, షమీ టీమిండియా తరపున అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. షమీ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా జాబితాలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News