Wednesday, February 5, 2025

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఫారిన్‌ గంజాయి సీజ్..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా ఫారిన్‌ గంజాయి పట్టుబడింది. బుధవారం ఉదయం కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఐదుగురిని తనిఖీ చేసిన అధికారులు విదేశి గంజాయిని గుర్తించారు. 5 ట్రాలీ బ్యాగుల్లో నింపి తీసుకొచ్చిన ఫారిన్‌ గంజాయిని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్ లో ఈ గంజాయి విలువ దాదాపు రూ.47 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News