Wednesday, February 5, 2025

శ్రీవారి దర్శన సమయం దాటిపోతుందని.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బుధవారం హైదరాబాద్- తిరుపతి విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ఈ విషయం చివరి నిమిషంలో ప్రయాణికులకు సిబ్బంది తెలిపారు. దీంతొ నాలుగు గంటలుగా విమానాశ్రయంలోనే ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విమానంలో వెళ్లాలనుకున్నవారు..  స్వామి వారి దర్శనం సమయం దాటిపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమానం 47 మంది ప్రయాణికులతో తిరుపతి వెళ్ళాల్సిండగా చివరి నిమిషంలో రద్దు కావడంతో ప్రయాణికులు.. విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News