- Advertisement -
హాస్టల్ భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం సంఘటన సిటిలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితోజీ బసు (22) అనే యువతి.. గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -