Wednesday, February 5, 2025

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పుష్ప 2’ హవా.. ఏడు దేశాల్లో ట్రెండింగ్..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంచలన విజయం సాధించింది. ఇండియన్ భాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి బాలీవుడ్ కే షాకిచ్చింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా రూ.1850 కోట్లకు పైగా వసూల్ చేసింది. బిగ్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదల అయ్యింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా..ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 5.8 మిలియన్స్ వ్యూస్‌తో ఏడు దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది.

కాగా, విడుదలైన తర్వాత అల్లుఅర్జున్ కెరీర్ లో ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో.. అంతే కష్టాలను తీసుకొచ్చింది. బన్నీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతోపాటు ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లాడు. దీంతో అల్లుఅర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి ఒక రోజు జైలుకు పంపించిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News