- Advertisement -
ములుగు జిల్లాలోని మేడారం చిన్నజాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేడారం చిన్న జాతర జరుగనున్నది. దీనికి ముందుగా మేడారం చిన్నజాతరకు గురువారం అంకురార్పణ చేయనున్నారు. వనదేవతల జాతర సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేస్తారు. మినీ జాతరకు ముందు జరిగే సంప్రదాయ పూజల్లో భాగంగా గుడిని శుద్ధి చేయడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంతో మేడారం చిన్నజాతర కోలాహలం ప్రారంభం అవుతుంది.
- Advertisement -