యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. లావణ్యను చంపేందుకు మస్తాన్ ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపిఎస్ సెక్షన్‌ను కూడా పోలీసులు జోడించారు. మస్తాన్ సాయి ల్యాప్‌టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్‌తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే ఆలోపే ఇతర డివైస్‌లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావ ణ్యను పలుమార్లు చంపేందుకు అతడు యత్నించాడు.
హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు తెలిపారు. మస్తాన్ సాయి అతడి స్నేహితులు డ్రగ్స్‌తో పార్టీలు చేసు కున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీకెండ్స్‌లో మస్తాన్ సాయి విల్లాలో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవి. మత్తులోకి జారుకున్న తర్వాత యువ తులపై లైంగిక దాడికి పాల్పడేవాడు. వారితో గడిపిన సమయంలో వీడియోలు రికార్డు చేసుకున్నాడు. కొందరు యువతులు డ్రగ్స్ తీసుకుంటున్న ప్పుడు వీడియోలు రికార్డు చేశాడు. అతడి హార్డ్ డిస్క్‌లో వీటిని గుర్తించారు. ప్రస్తుతం నిందితుడి సెల్‌ఫోన్, హార్డ్ డిస్క్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్ విశ్లేషణ జరుపుతోంది.