Thursday, February 6, 2025

రూ. 1126కోట్లు

- Advertisement -
- Advertisement -

రైతు ఖాతాల్లోకి
‘రైతుభరోసా’ నిధులు
21,45,330 మంది
రైతులకు లబ్ధి
ప్రజాప్రభుత్వానికి రైతే
తొలి ప్రాధాన్యత ఈ
యాసంగి వరి సన్నాలకు
బోనస్ : మంత్రి తుమ్మల
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతాంగానికి ఉన్న ఒక ఎకరం వరకు 17.03 లక్షల మంది రైతుల బ్యాంకు అ కౌంట్లలో రైతు భరోసా నిధులను ప్రభు త్వం బుధవారం విడుదల చేసింది. ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు ఇచ్చిన మాట ప్రకా రం రాష్ట్ర ప్ర భుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కా ల వ్యవధిలో చ్చేందుకు కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ శాఖ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి రైతే తొలి ప్రాధాన్యత అని, ప్రస్తుత యాసంగి వరి సన్నాలకు బోనస్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 26వ తేదీన రైతు భరోసా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన రైతు భ రోసా నిధులను కలుపుకొని ఈ రోజు వర కు మొత్తం రూ.1,126.54 కోట్లకు పైగా రైతుభరోసా నిధులు రైతు బ్యాంకు ఖాతా ల్లో జమ అయినట్లు – మంత్రి తుమ్మల వెల్లడించారు.

ఇప్పటికే రైతుభరోసాకు రూ.7, 625 కోట్లు, రుణమాఫీ కింద రూ.20, 616.89 కోట్లు, రైతు భీమాకు రూ.3వేల కోట్లు చొప్పన విడుదల చేశామని మంత్రి వివరించారు. రైతాంగం పండించే పంటల కు గిట్టుబాటు ధరల కల్పించేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం- ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్ధతుధరకు సేకరించనట్లు వివరించారు. రైతుల వద్దనున్న ప్రత్తిపంటను పూర్తిగా సేకరించడానికి కేంద్రం ప్రభుత్వం నుంచి గడువు కోరినట్లు తెలిపారు. రూ.406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు పంటలను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుండి మద్ధతు ధరకు కోనుగోలు చేశామన్నారు.

వానాకాలం రికార్డు స్థాయిలో వరి దిగుమతి
-గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు వచ్చాయని, వరిపంటకు మద్ధతు ధర కల్పించి కోనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్ లో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు,సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామని, అందుకు రూ.1,154 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెప్పారు.
యాసంగి సన్నాలకు బోనస్
ప్రస్తుత యాసంగికి వచ్చే వరి సన్నాలకు బోనస్ కొనసాగిస్తున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. పసుపు, మిరప పంటలకు కూడా మద్ధతు ధర నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News