మన తెలంగాణ/హైదరాబాద్/పంజాగుట్ట : ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌సి వర్గీకరణ రిజర్వేషన్‌ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జ రిగిందని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణ లో తమకున్యాయంగా 11శాతందక్కాల్సిన వా టా 9 శాతంగా నిర్ణయించడం సరికాదని అ న్నారు. జనాభా పంరంగా కాని, వెనకబాటుపరంగా కాని ఎలా చూసినా మాదిగలకు 11 శా తం రిజర్వేషన్‌లు దక్కాలని ఆయనన్నారు. ప్ర భుత్వం దీనిపై దృష్టి సారించి రిజర్వేషన్ల పంపిణీలోని లోపాలను సరిద్దిద్ది ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఎస్‌సి వర్గీకరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మందకృష్ణ బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాతిపదిక తీసుకున్నా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలి. కాని ప్ర భుత్వం ప్రతిపాదించిన దాంట్లో తమకు 9 శా తమే దక్కుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 లక్షలు ఉన్న మాదిగలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తే 32 లక్షలకు పైగా ఉన్న మాదిగలకు 11 శాతం రావాల్సిందేనని అన్నారు.
వర్గీకరణలో మాలలు కుట్రకు పాల్పడ్డారని, మాదిగలకు రిజర్వేషన్‌లు తగ్గడానికి వివేక్ కారణమని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మాదిగల హక్కులను కాపాడాల్సిన మంత్రి దామోదర రాజనర్సింహ ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రాజనర్సింహా మాదిగలకు ప్రతినిధి ఏమాత్రం కాజాలరని, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మాదిగలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి వర్గీకరణకు సంబంధించి తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పరిశీలించారని ఆయా రాష్ట్రాల్లో ఎస్‌సి రిజర్వేషన్‌లను రెండు గ్రూపులుగానే వర్గీకరించారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ మాదిగ, మాలలను రెండు గ్రూపులుగా విభజించాలని ఆలా కాని పక్షంలో నాలుగు గ్రూపులుగా వర్గీకరించాలని మ ందకృష్ణ డిమాండ్ చేశారు. వర్గీకరణకు షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సు చేయడం, రిజర్వేషన్‌ల వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణఁం తీసుకోవడాన్ని స్వాగతించిన మండకృష్ణ, క్రిమిలేయర్‌కు కమిషన్ చేసిన సిఫార్సును ప్రభుత్వం
తిరస్కరించిందని, అదేవిధంగా న్యాయంగా మాదిగలకు రావాల్సిన 11 శాతం రిజర్వేషన్‌లు కల్పించడంలోనూ ప్రభుత్వం లోపాలను సవరించుకోవాలని కోరారు. ఈనెల 7న ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ’లక్ష డప్పులు, వెయ్యి గొంతులు’ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఆ కార్యక్రమం 15 రోజుల్లోగా నిర్వహిస్తామని తేదీ, స్థలాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇది సాంస్కృతిక కార్యక్రమమని రిజర్వేషన్‌ల వర్గీకరణతో దీనికి సంబంధం లేదని అయినా ప్రభుత్వం అనుమతివ్వలేదని ఆయనన్నారు.