Thursday, February 6, 2025

బిసిల వాటా పెరిగింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గత గణాంకాల తో పోలిస్తే బీసీ జనాభా శాతం, వారి వాటా పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో 51.09 శాతంగా నమోదైన బీసీ జనాభా శాతం ఇప్పుడు 56.33శాతానికి పె రిగిందని తెలిపారు. అదేవిధంగా షెడ్యూల్డు తెగలు(ఎస్టీ) జనాభా 9.8శాతం నుంచి 10.45 శాతానికి పెరిగిందని, ఇతర కులాలు(ఓసీ) జ నాభా 21.55 శాతం నుంచి 15.79 శాతానికి తగ్గిందని వివరించారు. అయితే బీసీ జనాభా శాతం తగ్గిందని విపక్షాలు, కొందరు వ్యక్తులు చే స్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి ఉత్త మ్ స్పష్టం చేశారు. రాష్ట్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ కులగణనపై ప్రజానీకం ఎలాంటి అపోహలు పెట్టకోవద్దని కులగణన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇది శాస్త్రీయమైన సర్వే, ఈ తరహా సర్వే ముందెన్నడూ నిర్వహించలేదు, తప్పుడు గణాంకాలతో విపక్షాలు అసత్య ప్రచారానికి దిగుతున్నారని ఆయన తెలిపారు.

బుధవారం శాసనసభ కమిటీ హాల్‌లో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ‘సబ్ కమిటీ మెంబర్ ఎంపీ మల్లు రవి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అనంతరం శాసనసభ కమిటీ హాల్‌లో కులగణన సర్వేపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ రావులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రణాళిక లశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, రాష్ట్ర నోడల్ అధికారి,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి లతో కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే పూర్తిగా శాస్త్రీయంగా ఉందని, స్వాతంత్య్ర తర్వాత అత్యంత పకడ్బందీగా పారదర్శకంగా సర్వే నిర్వహించినట్లు చెప్పారు. 2011 జనాభా లెక్కల తరువాత క్షేత్ర స్థాయిలో నిర్వహించిన కులగణన ఇదేనని, విపక్షాలు తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు.ప్రస్తుత సర్వే చట్టబద్ధమైనదని, పూర్తి వివరాలతో తొలి కులాల సర్వేగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. వివిధ వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి, సంక్షేమ పథకాలు, విధానాలను రూపొందించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు.

రెండు దశల్లో సర్వే జరిగింది
రాష్ట్రంలో కులగణన సర్వే రెండు దశల్లో జరిగిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. సర్వేను ఖచ్చితంగా అమలు చేయడానికి, లక్ష మందికి పైగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించామని, ప్రభుత్వం రాష్ట్రాన్ని 94,261 ఎన్యుమ రేషన్ బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్ కు సుమారు 150 గృహాలను కవర్ చేసేలా మార్కింగ్ చేశారని వివరించారు. రికార్డు స్థాయిలో 50 రోజుల్లో సర్వే పూర్తయిందని, పట్టణాలు విస్తరించడంతో పాటు వలసలు ఉండడంతో కొత్తగా ఎన్యుమ రేషన్ బ్లాక్స్ ఏర్పాటు చేయ్యాల్సి వచ్చిందని ఆయన వివరించారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ – గృహాలను గుర్తించి నమోదు చేయగా, రెండో దశలో ప్రధాన డేటా జరిగిందని వివరించారు.

సీజీజీతో డేటా విశ్లేషణ
కులగణన సర్వే పూర్తి అయిన తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో ఆధునిక సాఫ్ట్‌వేర్ సాయంతో డేటా విశ్లేషణ చేపట్టారని, ఇందుకు 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియమించి, దాదాపు 36 రోజుల్లో డేటాను డిజిటలైజ్ చేశారని వివరించారు. దోషాలను గుర్తించడానికి ఆటోమేటెడ్ ఎర్రర్ డిటెక్షన్ మెకానిజాన్ని కూడా ఉపయోగించారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఉనికి కోసమే వారి ఆరోణలు
విపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికే కులగణన సర్వే నివేదికపై ఆరోపణలు చేస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే విపులంగా జరిగింది, ఆరోపణలు చేసే విపక్షాల వద్ద నిజమైన గణాంకాలు లేవు. వారి వాదనలు పూర్తిగా సత్యదూరం అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News