Thursday, February 6, 2025

ఇంటిని అమ్మి ప్రియుడితో పారిపోయిన భార్య… భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: భార్య ఇంటిని అమ్మి తన ప్రియుడితో కలిసి పారిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కన్యకుమారి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విల్లుకురి చెందిన బెంజిమన్(47) అనే వ్యక్తి 18 19 సంవత్సరాల క్రితం సునీతను(45) పెళ్లి చేసుకున్నాడు. బెంజమిన్ సౌదీ అరేబియాలో ఉంటూ భార్యకు డబ్బులు పంపించేవాడు. సునీత తల్లి పుట్టింట్లో ఉండేవారు. తన సతీమణి ఇష్టం ప్రకారం తన పూర్వీకుల ఇల్లును బెంజమిన్ అమ్మారు. దక్షిణ మణక్కావిళైలో తన భార్య పేరుతో కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు. గత కొన్ని రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గత కొన్ని రోజుల ఆమె కనిపించకుండాపోవడంతో అనుమానం ఇంటికి వచ్చాడు. ఇల్లు అమ్మినట్టు తెలియడంతో పలుచోట్ల గాలించి అనంతరం పోలీసులకు పిర్యాదు చేశాడు. తిరువందికరైకి చెందిన సైజు అనే వ్యక్తితో కలిసి ఆమె ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. దుబాయ్ కష్టపడి చేసిన డబ్బులతో ఇల్లు తన భార్యపేరు మీద కొన్నానని, ఆమె ఇప్పుడు ఇల్లు అమ్మేసి ప్రియుడితో పారిపోవడంతో అతడు మానసిక వేదనకు గురయాయడు. సునీత, ఆమె ప్రియుడు సైజు, ఆమె సోదరి షీలా తనని మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News