ముంబయి: అడవిలో పందులను వేటాడుతుండగా తనతో పాటు వచ్చిన వ్యక్తిపై వేటగాడు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడుగురు వేటగాళ్లు అడవి పందుల కోసం బోర్షెటి అడవిలోకి వెళ్లారు. జట్లుగా విడిపోయి పందుల కోసం వేట ప్రారంభించారు. రాత్రి సమయంలో ఓ పొదలో నుంచి అలజడి రావడంతో ఓ వేటగాడు గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. బృందంలో ఓ వ్యక్తికి బుల్లెట్ తగలడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మిగితా వారు భయపడి మృతదేహాన్ని చెట్ల పొదల్లో దాచి అక్కడి నుంచి పారిపోయారు. సదరు వ్యక్తి కనిపించకపోవడంతో పోలీసులు మిగిలిన ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పారు. మృతదేహం స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అటవీ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అడవి పంది అనుకొని వేటగాడిపై కాల్పులు… ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -