హైదరాబాద్: యుజిసి నూతన మార్గదర్శకాలపై అభిప్రాయాలను నివేదించామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యుజిసి నూతన నిబంధనలు ఉన్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ తో కెటిఆర్ సమావేశమయ్యారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్ కు అప్పగించేలా నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ల ద్వారా వర్శిటీలను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకోవడం మంచిది కాదని హితువు పలికారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబిసి విద్యార్థులకు అన్యాయం జరిగిందని కెటిఆర్ బాధను వ్యక్తం చేశారు. యూజిసి నిబంధనలపై అభ్యంతరాలను 6 పేజీలతో నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించామన్నారు. ఎన్ హెచ్- 365 బి రహదారిని పొడిగించాలని గడ్కరీని కోరామని, సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు ఎన్ హెచ్-360 బి రహదారిని పొడిగించాలని వినతులు ఇచ్చామని కెటిఆర్ పేర్కొన్నారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దు: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -