Thursday, February 6, 2025

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ వేదికగా భారత్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు. టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో ఇంగ్లండ్ కీలక వికెట్లు కోల్పోయింది. ఇక, స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది ఇంగ్లండ్‌. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్ లో భారీ షాట్‌కు ప్రయత్నించిన బట్లర్‌ (52) వికెట్ చేజార్చుకున్నాడు. స్లిప్‌లో హార్దిక్‌ పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగ్‌స్టన్‌ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. అర్షిత్ రాణా బౌలింగ్ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 184 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో బెతెల్‌ (30), కార్స్(0)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News