- Advertisement -
స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని బీవిఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డీజే టిల్లూతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్ధూ.. ఈ సినిమా పక్కా కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనుున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో టీజర్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.ఇక, ఈ మూవీలో సిద్ధూ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానున్నంది
- Advertisement -