- Advertisement -
తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమిండియాకు 249 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ కు దిగింది. అయితే, ఆరంభం అదిరినా.. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు భారీగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. బట్లర్ (52), బెతెల్ (51)లు మాత్రమే అర్ధశతకాలతో రాణించారు. జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, జడేజాకు చెరో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ లు తలో ఒక్కో వికెట్ తీశారు.
- Advertisement -