హైదరాబాద్: పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) మీటింగ్‌లో నిర్ణయించినట్లు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గన్నారు. మీటింగ్ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని.. లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
“రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చించాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాం. పథకాలను ప్రజలకు వివరించాలని సూచించాం. కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి” అని పేర్కొన్నారు.