- Advertisement -
హైదరాబాద్: స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన సిటీలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ హిల్స్‌లో చోటుచేసుకుంది. శ్రీ చైతన్య స్కూల్లో ఎల్ కేజీ చదువుతున్న రిత్విక(4).. గురువారం సాయంత్రం బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా.. బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. రిత్వికను గమనించకుండా బస్సును రివర్స్ తీసిన డ్రైవర్.. ఈ క్రమంలో బస్సు కిందపడి అక్కడిక్కడే చిన్నారి రిత్విక మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -