Thursday, February 6, 2025

అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు : పనామా ప్రకటన

- Advertisement -
- Advertisement -

పనామా సిటీ : పనామా కాలువలోనుంచి అమెరికా ప్రభుత్వ నౌకలు ప్రయాణించే సమయంలో వాటి నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయమని పనామా చెప్పినట్టు అమెరికా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పోస్టు చేసింది. కానీ , పనామా మాత్రం అలాంటి రాయితీలేమీ ఇవ్వలేదంటూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. తాజాగా పనామా కెనాల్ అథారిటీ స్పందిస్తూ…“ టోల్ వ్యవస్థను బలోపేతం చేయడం, మార్పులు వంటివి మా పరిధి లోకి వస్తాయి. ఇప్పటివరకు ఎటువంటి సవరణలు చేయలేదు” అని ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ వారం లాటిన్ అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కెనాల్‌పై చైనా నియంత్రణల్లో తక్షణమే మార్పులు తీసుకురావాలని ఆయన గట్టిగా ఒత్తిడి చేయనున్నారు. ఆ దేశం చర్యలు తీసుకోకపోతే మాత్రం తాము ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఆయన తాజాగా పనామా అధ్యక్షులు జాస్ రౌల్‌తో భేటీ ఆయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News