- Advertisement -
తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ విధించిన 249 పరుగులు లక్ష్యాన్ని భారత్.. 38.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్(87), శ్రేయస్ అయ్యర్(59), అక్షర్ పటేల్(52)లు అర్ధ శతకాలతో రాణించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్.. 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బట్లర్ (52), బెతెల్ (51)లు మాత్రమే అర్ధశతకాలతో రాణించారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, జడేజాకు చెరో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ లు తలో ఒక్కో వికెట్ తీశారు.
- Advertisement -