Friday, February 7, 2025

అంత బెనిఫిట్ మాకొద్దు.. తండేల్ బెనిఫిట్ షోలపై అల్లుఅరవింద్..

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ తెరకెక్కిన రెండో చిత్రం తండేల్. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రేపు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఏపీలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, తెలంగాణలో టికెట్ రేట్ ధరల పెంపుపై స్పష్టత లేదు.

ఈ క్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగాం. టికెట్ ధరలు రూ.50 పెంచమని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం. తెలంగాణలో టికెట్ ధరల పెంచమని అడగలేదు.ఇక్కడ రూ.295, రూ.395 పెరిగి ఉన్నాయి. అలాగే తెలంగాణలో తండేల్ బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకు వద్దు” అని అల్లు అరవింద్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News