అక్రమ వలసదారుల విషాదగాథలు
ఏజెంట్లను నమ్మి ప్రాణాల మీదకు
తెచ్చుకుంటున్న వలసదారులు
నరకకూపమైన డేరియన్ గ్యాప్ మీదుగా
డేరింగ్ ప్రయాణం ఆహారం, నీళ్లు,
ఇతర సదుపాయాలేమీ ఉండవు
రోగం వస్తే ఎవరి చావు వాళ్లదే
న్యూఢిల్లీ : వారు ప్రమాదకరమైన పర్వతాలు ఎక్కా రు. దట్టమైన వానకారు అడవుల్లోంచి, చిత్తడి బుర దనేలల్లోంచి కొన్ని వందల కిలోమీటర్లు కాళ్లీడ్చు కుంటూ ముందుకు సాగారు. ఇదంతా తమ సు దీ ర్ఘకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలన్న ఆరాటమే. అ నేక ఖండాలను దాటుకుంటూ చివరకు ప్రమాదం లో పడ్డారు.అమెరికా సరిహద్దు నిఘా విభాగం సం కెళ్లు వేసింది. ఇది అమెరికా బహిష్కరించగా తిరి గి వెనక్కు వచ్చిన 104 మంది అక్రమవలసదారుల దయనీయ
గాథలు. అమెరికా ఒక భూతలస్వర్గమని బంగారు కలలు కనే వారికి చివరికి భరించరాని పీడకల వెంటాడింది. ఈ 104 మందిలో హర్యానా, గుజరాత్‌కు చెందిన వారు 33 మంది కాగా, పంజాబ్ వారు 30 మంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు, ఛండీగఢ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదు, ఏడేళ్ల ఇద్దరు బాలికలు, తోసహా 13 మంది మైనర్లు, ఉన్నారు. అమెరికా వెళ్లి బాగా సంపాదించుకుందామన్న ఆశతో ఈ వలసదారుల్లో చాలామంది రుణాలు తెచ్చుకుని కూడా విపరీతంగా డబ్బుఖర్చు పెట్టారు. వీరిని తీసుకువెళ్లే ఏజెంట్లు అమెరికాకు చట్టబద్ధంగానే పంపిస్తామని నమ్మించారు.
కానీ ఏజెంట్లు ఎన్నో పన్నాగాలు పన్ని మోసాలు, కష్టాలు మిగిల్చారు. అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారికి డేరియన్ గ్యాప్ రూటే శరణ్యం. ఏజెంట్లను నమ్మి మోసపోయిన వారు ఈ మార్గంలోనే అమెరికా వైపు ప్రయాణిస్తారు. కొలంబియా నుంచి పనామాకు వెళ్లే ఈ మార్గం అంతా ఎలాంటి రోడ్డు లేని దట్టమైన అటవీ ప్రాంతం. 97 కిమీ పొడవైన ఈ మార్గంలో వానకారు అడవులు, చిత్తడినేలలు, పర్వతాలు ఉంటాయి. విషసర్పాలు, పులులు, ప్రాణాంతక కీటకాలతో అడవులు నిండి ఉంటాయి. పాన్ అమెరికా జాతీయ రహదారి ఒక్కటే రోడ్డు తగులుతుంది. అలస్కా నుంచి అర్జెంటైనా వరకు ఈ రోడ్డులో ఏమాత్రం నడవలేని కఠినమైన దారిలా ఉంటుంది. భరింపలేని భయంకర వాతావరణం, కనీస సదుపాయాలు ఉండవు. ఈ రూటంతా స్మగ్లర్లు, దొంగల ముఠాలు, బెడద ఎక్కువ. వారు వలసవాదులను దోచుకోవడమే కాదు. అవసరమైతే వారిని హింసిస్తుంటారు. కానీ అక్రమ వలసవాదులకు ఈ కష్టాలేమీ అనిపించవు. దీనికి కారణం అమెరికా చేరుకోవాలని కలలు కంటుండడమే.
కొన్ని లక్షల మందికి ఇదే రూటు
ఇటీవల సంవత్సరాల్లో డేరియన్ గ్యాప్ రూటు కొన్ని లక్షల మంది వలసవాదులతో రద్దీగా తయారౌతోంది. 2023లో 5.2 లక్షల మంది ప్రయాణించగా, 2024లో 3 లక్షల మంది ప్రయాణించారు. దశాబ్దం క్రితం కేవలం కొద్దిమంది మాత్రమే ఈ రూటులో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు పెద్ద రిస్కుతో కూడిన హైవేగా తయారైంది. వెనిజులా, హైతీ, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ నుంచి అక్రమవలసవాదులు ఈ రూటు మీదుగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 20152022 మధ్య 312 మంది అదృశ్యం కాగా, 202123 లో 229 మంది గల్లంతయ్యారు. 2023 లో 676 మంది లైంగిక బాధితులయ్యారు. ఈ రూటులో షెల్టర్లు ఉన్నా ఆహారం, నీళ్లు , ఇతర సదుపాయాలు ఏవీ ఉండవు. రోగమొస్తే మందిచ్చేవారుండరు. ఎవరి చావు వారు చావాల్సిందే. పంజాబ్ గురుదాస్‌పూర్‌కు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ తనను అమెరికాకు చట్టబద్ధంగా తీసుకెళ్తానని నమ్మించడంతో ఏజెంట్‌కు రూ. 30 లక్షలు ముట్టచెప్పానని తెలియజేశాడు. మొదట బ్రెజిల్‌కు విమానంలో వెళ్లానని, అక్కడ నుంచి కూడా విమానంలో తీసుకువెళ్తానని నమ్మించి నరకకూపం లోకి నెట్టివేశాడని వాపోయాడు. అక్కడ నుంచి చాలా ప్రమాదకరమైన దొడ్డిదారి మీదుగా నడిపించాడని చెప్పాడు. అమెరికాకు దొడ్డిదారిన వెళ్లే ముందు బ్రెజిల్లో సింగ్ ఆరుమాసాలు గడపవలసి వచ్చింది.
చివరకు జనవరి 24న అమెరికా సరిహద్దు పెట్రోల్ అరెస్ట్ చేసింది. 11 రోజులు నిర్బంధలో మగ్గవలసి వచ్చింది. తమను స్వదేశం భారత్‌కు తీసుకెళ్తున్నట్టు తెలియదని, మరో డిటెన్షన్ సెంటర్‌కు తీసుకువెళ్తున్నారని అనుకున్నామని సింగ్ పేర్కొన్నాడు. అమృత్‌సర్‌కు వచ్చేవరకు తమ కాళ్లూ చేతులకు బేడీలు వేశారని చెప్పాడు. పంజాబ్ హోషియార్‌పూర్‌కు చెందిన హర్వీందర్‌సింగ్ తన ఏజెంట్‌కు రూ.42 లక్షలు చెల్లించాడు. ఖతార్, బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా, నికారగువా, మెక్సికో దేశాల మీదుగా తనను తీసుకెళ్లారని చెప్పాడు. రోజుల కొలదీ నడవాల్సి వచ్చిందని, పర్వతాలు దాటుకుని, సముద్రాల్లో మునిగి తేలుతూ బతికి బయటపడ్డామని తెలిపాడు. పనామా అడవిలో ఒకరు , సముద్రంలో మునిగి ఒకరు చనిపోవడం చూశామని చెప్పాడు. తాము 17నుంచి 18 పర్వతాలు ఎక్కిదిగామని, కాలుజారితే బతికే అవకాశమే లేదని చెప్పాడు. అమెరికాకు అక్రమంగా వెళ్లే మార్గం చాలా భయంకరంగా ఉంటుంది. అనేక దేశాలను , ఖండాలను దాటుకుంటూ ఎన్నో కష్టనష్టాలను భరించవలసి వస్తుంది.