మంత్రులతో సమస్యలు ఉంటే
నాకు చెప్పండి నాతోనే సమస్య
ఉంటే హైకమాండ్‌కు చెప్పండి
పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ
బహిరంగంగా మాట్లాడొద్దు
పనుల కోసం అయితే రండి..
పైరవీల కోసమైతే రావొద్దు
ఎంఎల్ఎలు, ఎంఎల్‌సిలతో
మనసు విప్పి మాట్లాడిన సిఎం
మన తెలంగాణ /హైదరాబాద్ : ‘ఎమ్మెల్యేలకు ఏదైనా సమస్య ఉంటే మంత్రుల దృష్టికి తీసుకెళ్లం డి. మంత్రులతోనే సమస్య ఉంటే నాకు చెప్పండి. నాతోనే సమస్య ఉంటే రాహుల్‌గాంధీ దృష్టికి తీ సుకెళ్లండి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ ఎ మ్మెల్యేలకు సూచించారు. అంతే కానీ ప్రభుత్వ , పార్టీ అంతర్గత విషయాలపై ప్రైవేట్‌గా భేటీలు కా వద్దని సీఎం హితవు
పలికారు. సమస్య ఏదున్నా పార్టీ వేదికలపై చర్చించాలి తప్ప బహిర్గతంగా మాట్లాడటం క్రమశిక్షణా రాహిత్య అవుతుందని అలాంటి వాటిని ఉపేక్షించదని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం ఐదున్నర గంటలపాటు జరిగిన కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి మనసు విప్పి మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల ప్రైవేట్‌గా సమావేశమైన విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా సీఎం ప్రస్తావిస్తూ పై హెచ్చరిక చేసారు. మనమంతా ఒక పార్టీకి, ప్రభుత్వానికి చెందినవారం, కలిసి చర్చించుకోవడంలో మొహమాటం ఎందుకని సీఎం ప్రశ్నించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు, విజయాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో మంత్రులకు ఎంతటి బాధ్యత ఉందో, ఎమ్మెల్యేలకూ అంతే బాధ్యత ఉందని సీఎం గుర్తు చేసినట్టు తెలిసింది.
మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం
జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో ఆ జిల్లాకు చెందిన మంత్రి, ఇన్‌చార్జ్జి మంత్రితో చర్చించి పరిష్కరించుకోవాలని, సమన్వయంతో పని చేసుకోవాలని సీఎం సూచించినట్టు తెలిసింది. వారితో పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకరావాలని సూచించినట్టు తెలిసింది. నా వద్ద కూడా పరిష్కారం కాకపోతే పార్టీ అధిష్టానం దృష్టికి నిరభ్యంతరంగా తీసుకెళ్లవచ్చని రేవంత్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలోగానే పూడ్చుకోవాలని, ఈ విషయంలో తాను కూడా చొరవ తీసుకోనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
పనుల కోసం రండి&పైరవీల కోసమైతే వద్దు !
నియోజకవర్గ పనుల కోసం నా స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమైతే నిరభ్యంతరంగా రావచ్చు&అంతే కానీ పైరవీల కోసం అయితే రావద్దు, మీకు నిరాశ తప్పదని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో మీకు సమస్య ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లవచ్చని,అవసరమైతే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేతో మాట్లాడి తానే అపాయింట్మెంట్ ఇప్పిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వివక్ష లేదు
ఇలా ఉండగా అభివృద్ధి నిధుల కేటాయింపు, మంజూరి, విడుదలలో మంత్రులే వాటిని తన్నుకుపోతుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని, ఎమె ్మల్యేల పట్ల వివక్ష కనబరస్తున్నారని ఇటీవల కొందరు ఎమ్మెల్యేల రహస్య సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల విడుదలపై నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులపై డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది.