Monday, March 10, 2025

సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాల హక్కులను హరిస్తున్న యుజిసి కొత్త నిబంధనలు వర్శిటీల
నియామకాల్లో రాష్ట్రాల ప్రమేయానికి గండి కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇచ్చిన వినతిపత్రంలో బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్ 365 జాతీయ రహదారిని వేములవాడ నుంచి
కోరుట్ల వరకు విస్తరించాలని గడ్కరీకి విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో రాష్ట్రా ల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా యుజిసి నిబంధనలు ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల నియామకానికి వేసే సె ర్చ్ కమిటీలకు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్రం తీసుకురానున్న యుజి సి నిబంధనల పైన ధర్మేంద్ర ప్రధాన్‌కి కూలంకషంగా వివరించినట్లు తెలిపారు. యుజిసి నూ తన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మ్రంత్రికి నివేదించినట్లు వెల్లడించారు. కెటిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ నేతలు సబి తాఇంద్రారెడ్డి, మాజీ ఎంపి బి.వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,సురేష్‌రెడ్డి, ఎంఎల్‌ఎ
సంజయ్‌కుమార్, మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ తదితరులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు.యుజిసి ముసాయిదా నిబంధనలపై బిఆర్‌ఎస్ నేతలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వినతిపత్రం సమర్పించింది. ఆ తర్వాత 365 బి జాతీయ రహదానికి సూర్యాపేట సిరిసిల్ల రహదారిని కోరుట్ల వరకు విస్తరించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోరారు.

అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యుజిసి నిబంధనలో కొన్ని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయని అన్నారు. గవర్నర్లకు అధికారాలు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీల్లోని నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. వైస్ ఛాన్స్‌లర్ ఎంపికలో నిపుణులు ఉండేలా పారదర్శకంగా ఉండాలని సూచించామని పేర్కొన్నారు. తమ అభిప్రాయాలు యూజీసీకి సైతం చెప్పామన్నారు.యుజిసి చేయదలచిన మార్పులపైన కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ ఆలోచనలను లేఖ రూపంలో తెలియజేశామని చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశ పౌరులు విజయవంతంగా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం దేశంలోని యూనివర్సిటీలే అని, యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనల ఫలితాల వల్లనే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధితో పాటు అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ఐఐటి వంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థలు కూడా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం యుజిసి నిబంధనలో తేవాలనుకుంటున్న మార్పులపైన తమ పార్టీ డిమాండ్లను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానికి తెలియజేశామని అన్నారు.

యుజిసి నూతన నిబంధనలను రూపొందించాలి
రానున్న నూతన యుజిసి మార్గదర్శకాలు మార్పుల పైన తమ పార్టీ తరఫున విద్య రంగ మేధావులతో ఒక సమావేశం నిర్వహించిన తర్వాత తమ పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని కెటిఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలియజేసినట్లు పేర్కొన్నారు. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే ఒక నిబంధనను తీసుకురావడం ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కాకుండా అభ్యర్థులు దొరకలేదని సాకుతో ఆ ఉద్యోగాలు ఇతర కేటగిరీలను భర్తీ చేసే ప్రమాదముందని, ఇది భారత రాజ్యాంగం ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కును హారించడమే అని చెప్పారు.

యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీలో కేవలం విద్యార్హతల పైన మాత్రమే కాకుండా పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు. తమ పార్టీ తరఫున సుదీర్ఘమైన ఆరు పేజీల విజ్ఞప్తిని కేంద్రమంత్రికి అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి హక్కులను హరించకుండా యుజిసి నూతన నిబంధనలను రూపొందించాలని కోరామనాన్నారు. జాతీయ రహదారి 365 బిని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని కోరామని కెటిఆర్ తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కూడా కలిశామని చెప్పారు. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిను ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారిని కలిపేలా విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై వేటుపడేలా కోర్టులో కొట్లాడుతాం
తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని కెటిఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని, వారిపై అనర్హత వేటుపడాలని చెప్పారు. అదే అంశంపై న్యాయం నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. కచ్చితంగా పార్టీ మారిన ఎంఎల్‌ఎల పైన వేటుపడేలా.. కోర్టులో కొట్లాడుతామని వెల్లడిచారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరుతానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News